Samantha Naga Chaithanya : అక్కినేని నాగచైతన్య తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య విడాకులు ప్రకటించిన తర్వాత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వరుస సినిమా కథలను వింటూ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక కథల ఎంపిక విషయంలోనూ నాగచైతన్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ చిత్రంగా తెరకెక్కుతున్న బంగార్రాజులో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు.
ఇక థాంక్యూ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడట. కాగా ఈ చిత్రాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉన్నాడు.
మరోవైపు సమంత కూడా విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమె నటించిన శాకుంతలం, కాతువాకుల రెండ కాదల్ అనే మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆహా నిర్మించే ఓ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఓ బాలీవుడ్ మూవీకి సమంత ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక త్వరలోనే పుష్ప మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌ను చేయనుంది. ఇలా ఈ వీరిద్దరూ విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…