Samantha : వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. బిగ్ బాస్ షోతో బుల్లితెరని టచ్ చేశాడు. ఈ షో భారీ టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్‌పతిఅనే ప్రోగ్రాంకి తెలుగు వర్షన్ గా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, రెండు ఎపిసోడ్స్‌కి భారీ రేటింగ్ వచ్చింది. ఇక కొద్ది రోజులకి రాజమౌళి, కొరటాల శివ కూడా హాజరై ఆశ్చర్యపరిచారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఊహించిన టీఆర్పీలు రాకపోవడంతో పలువురు స్టార్స్‌ని గెస్ట్‌గా తీసుకొస్తున్నారు. ఈ షో మొదటి కర్టెన్ రైజర్ ఈవెంట్ ను రామ్ చరణ్ తో ప్లాన్ చేయగా, ఆ తర్వాత రాజమౌళి- కొరటాల శివ ఇద్దరితో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు. ఆయన ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ ను ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్స్ సంప్రదించిందని ఎన్టీఆర్‌తో ప్రభాస్ కి కూడా మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు మాట ఇచ్చేశాడని అంటున్నారు.
ఇక తాజాగా నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంతను హాట్ సీట్‌లో కూర్చోపెట్టేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పేరు ట్రెండింగ్‌లోఉండగా, ఈ అమ్మడిని తీసుకొస్తే షోకి మరింత టీఆర్పీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…