Nagarjuna : నాగార్జునకు సమంత భారీ షాక్.. ఊహించని పరిణామం..?

Nagarjuna : నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి సమంత తన పనేంటో తాను చేసుకుంటోంది. అటు అక్కినేని వారిపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. వారు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో సమంత ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. సమంత ఆ కామెంట్‌ పెట్టడం ద్వారా నాగార్జునకు భారీ షాక్‌ ఇచ్చిందని అంటున్నారు. అయితే అసలు ఇంతకీ విషయం ఏమిటంటే..

బిగ్‌బాస్‌ ప్రారంభం అయ్యాక తొలి సీజన్‌కు ఎన్‌టీఆర్‌, ఆ తరువాత నానిలు హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఇక బిగ్‌ బాస్‌ 3వ సీజన్‌ నుంచి నాగార్జుననే ఆ స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. ఈ మధ్యే ముగిసిన బిగ్‌ బాస్‌ ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్‌గా ఉన్నారు. అయితే నాగార్జున వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఆయన షోను నిర్వహించలేకపోతున్నారు. గతంలో ఉన్న జోష్‌, ఉత్సాహం తగ్గిపోయాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌ బాస్‌ 6కు ఆయన హోస్ట్‌గా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే బిగ్‌ బాస్‌ 6కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. కానీ నాగార్జుననే హోస్ట్‌గా ఉంటారా.. అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు నాగార్జునకు బదులుగా ఆయన మాజీ కోడలు సమంతను హోస్ట్‌గా తీసుకురావాలని బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే సమంత తన ఇన్‌స్టా ఖాతాలో కమింగ్‌ సూన్‌ అనే కామెంట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.

Nagarjuna

వాస్తవానికి నాగార్జున బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వచ్చినప్పటి నుంచే ఆయన యాంకరింగ్‌ చాలా మందికి నచ్చలేదు. ఆయనను మార్చండి మహాప్రభో అని ఎప్పుడూ ప్రేక్షకులు వేడుకుంటున్నారు కూడా. అయితే ఇటీవల ముగిసిన బిగ్‌ బాస్‌ ఓటీటీ దారుణంగా ఫ్లాప్ అయింది. రేటింగ్స్‌ అసలు రాలేదు. దీంతో బిగ్‌బాస్‌ 6కు నాగార్జునను కొనసాగిస్తే రేటింగ్స్‌ రాకపోతే పరిస్థితి ఏమిటని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. కనుకనే సమంతను తీసుకోవాలని చూస్తున్నారట. అందువల్లే సమంత కమింగ్‌ సూన్‌ అని కామెంట్‌ పెట్టి ఉంటుందని అంటున్నారు. సమంత గతంలో నాగార్జున లేనప్పుడు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అలరించింది. అప్పటికి చైతూకు ఇంకా విడాకులు ఇవ్వలేదు. కానీ షోను మాత్రం బాగానే నిర్వహించింది. దీంతో ఆమెకు యాంకర్‌గా కూడా మంచి మార్కులే పడ్డాయి. కనుక సమంత అయితే ఈ షోకు మరింత ఊపు వస్తుందని.. పైగా ఆమె విడాకులు తీసుకుంది కనుక.. ఆమెను ఈ షోకు హోస్ట్‌గా తెస్తే.. ఆమెను చూసేందుకైనా ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తారని.. దీంతో రేటింగ్స్‌ పెరిగే అవకాశం ఉందని.. నిర్వాహకులు భావిస్తున్నారట. కనుక బిగ్‌బాస్‌ సీజన్‌ 6కి సమంతనే హోస్ట్‌ అనే విషయం దాదాపుగా ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది.

అయితే సమంత గనక బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వస్తే.. అది నాగార్జునకు భారీ షాక్‌ అవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా హోస్ట్‌గా రాణించాలని అనుకుంటున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆయనను ఇకపై ఆమోదించలేమని అంటున్నారు. అలాంటి సీనియర్‌ స్థానంలో ఒక జూనియర్‌ను తీసుకు వస్తే ఆయనకు షాక్‌ కాక ఇంకేమవుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిన బిగ్‌ బాస్‌ కీలక పరిణామాల్లో ఇది ఊహించని మలుపు అని చెప్పవచ్చు. మరి సమంత నిజంగానే హోస్ట్‌గా వస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM