Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య ఉన్నట్లుండి సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఎవరికీ నచ్చలేదు. ఈ వార్తను చదివి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా.. అనే సందేహాలు అందరికీ వచ్చాయి. అయితే వీరి విడాకులకు కారణం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ తాజాగా ఓ సంచలన విషయం మాత్రం బయటకు వచ్చింది.
నాగచైతన్య ఇటీవలే థాంక్ యూ అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం విదితమే. ఇందులో అవికా గోర్, రాశి ఖన్నా కూడా నటించారు. అయితే తాజాగా చైతూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న దూత అనే సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ను చైతూ చేసేందుకు సమంతనే కారణమట. అప్పట్లో ఈ సిరీస్‌ను చేయాల్సిందిగా సమంత.. చైతూను బలవంత పెట్టిందట. ఆమెతో కలసి ఉన్న సమయంలో చైతూ సినిమాల వ్యవహారాలను ఆమెనే దగ్గరుండి చూసుకునేదట. కనుకనే దూత సిరీస్ చేయాల్సిందిగా పట్టుబట్టిందట. దీంతో ఆమె ఒత్తిడి మేరకు చైతూ తనకు ఇష్టం లేకపోయినా ఈ సిరీస్‌ను చేసేందుకు అంగీకరిస్తూ.. పత్రాలపై సంతకం చేశాడట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది.. అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి చైతూ అయితే ఈ సిరీస్ చేస్తున్నాడు. మరి ఇందులో చైతూది నిజంగానే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రేనా.. కాదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక సమంత తన పెళ్లి విషయంలోనూ చైతూ తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించిందట. అప్పట్లో అఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది. దీంతో సమంతతో పెళ్లి వద్దని.. ఇంకో అమ్మాయిని చేసుకోవాలని నాగార్జున చైతూకు చెప్పారట. కానీ సమంత వారిని బలవంతంగా ఒప్పించి చైతన్యను వివాహం చేసుకుందట. ఈ విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరు విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది అన్నది తెలియలేదు. అలాగే ఈ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పటికైనా నిజం బయట పడక తప్పదు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…