Samantha : జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తున్న స‌మంత‌.. వీడియో వైర‌ల్‌..

Samantha : సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు.. స‌మంత‌. అవును.. సోషల్ మీడియాలో ఈమె ఇచ్చే అప్‌డేట్స్ ఎక్కువే ఉంటాయి. చిన్న విష‌యం గురించి కూడా స‌మంత పోస్ట్‌లు పెడుతుంటుంది. అయితే ఆమె ఈమ‌ధ్య కాలంలో జోరు త‌గ్గించింది. గ‌తంలో చైతూతో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత మామ్ సెయిడ్ పేరిట అనేక సందేశాల‌ను పోస్ట్ చేసింది. ఆ త‌రువాత త‌న సినిమా షూటింగ్స్ తాలూకు అప్‌డేట్స్‌ను, బ్రాండ్ల‌కు చెందిన యాడ్స్‌ను, ఫొటోషూట్స్‌ను వ‌రుస‌గా పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత పెద్ద యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

స‌మంత ఇటీవ‌లే కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోలో పాల్గొని చైత‌న్య‌తోపాటు త‌న విడాకులు, ఇత‌ర వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కీల‌క‌వ్యాఖ్య‌లు చేసింది. చైతూను భ‌ర్త అని పిలిచేందుకు కూడా స‌మంత ఇష్ట‌ప‌డ‌లేదు. అలాగే త‌మ ఇద్ద‌రినీ ప్ర‌స్తుతం ఒక గదిలో గ‌నుక బంధిస్తే.. త‌మ వ‌ద్ద ప‌దునైన వ‌స్తువులు ఉండ‌కుండా చూడాల‌ని చెప్పింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఎంత శ‌త్రుత్వం ఉంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే స‌మంత అన్ని కామెంట్స్ చేసిన‌ప్ప‌టికీ చైత‌న్య మాత్రం వాటిపై పెద‌వి విప్ప‌లేదు. కానీ ఇటీవ‌లే లాల్ సింగ్ చ‌డ్డా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న చైతూ.. విడాకుల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Samantha

తాము విడాకులు తీసుకునే ముందు కుటుంబ స‌భ్యులు, స్నేహితులు అంద‌రికీ చెప్పామ‌ని.. ఆ త‌రువాతే విడాకుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించామ‌ని.. దీనికి గురించి త‌మ వాళ్ల‌కు ముందుగానే తెలుస‌ని.. ఇక చెప్పేది ఏమీ లేద‌ని చైత‌న్య అన్నాడు. దీంతో ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. అయితే స‌మంత ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో డీలా ప‌డిపోవ‌డం వెనుక ఉన్న కార‌ణాలేమిటా.. అని నెటిజ‌న్లు ఆలోచిస్తున్నారు. అయితే అందుకు కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు.

స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం మూవీ అప్‌డేట్ లేదు. అస‌లు ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు. అప్ప‌ట్లో స‌మంత బ‌ర్త్ డే రోజున ఒక పోస్ట‌ర్ వదిలారు. మ‌ళ్లీ అప్‌డేట్ ఇవ్వ‌లేదు. ఇక య‌శోద మీదే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ మూవీ గురించి కూడా ఎక్క‌డా ప్ర‌మోష‌న్స్ చేయ‌డం లేదు. దీంతో స‌హజంగానే స‌మంత డీలా ప‌డింద‌ని.. దాని వ‌ల్లే సోష‌ల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అంటున్నారు. ఇక స‌మంత‌కు చెందిన పాత వీడియోల‌ను కూడా కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు. ఆమె గతంలో జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో ఒక‌టి తాజాగా మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. ఇక స‌మంత య‌శోద ద్వారా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Share
Shiva P

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM