Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మడు సినిమాలు, పర్సనల్ విషయాలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సమంత కొద్ది రోజుల క్రితం శాకుంతలం అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. మహాభారతంలోని ఆదిపర్వం స్పూర్తిగా.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతోంది. మైథలాజికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో సామ్ శకుంతలగా కనిపించనుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత రాజుగా నటిస్తున్నాడు. కబీర్ సింగ్ దుహన్ రాజు అసుర పాత్ర పోషిస్తున్నాడు.
గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా కోసం సామ్ ప్రత్యేకించి బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకుంది. శకుంతల పాత్ర కోసం మూడు నెలలు శిక్షణ తీసుకున్నట్టు చెప్పింది సామ్. పురాణాల కాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక, పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇతర అంశాలపై సామ్ శిక్షణ తీసుకుందట. అయితే ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొన్నాళ్లుగా ఒక్క అప్‌డేట్ లేదు. కనీసం సమంత ఈ సినిమా చేసిందని కొంత మందికి తెలియదు కూడా.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సినిమా కోసం ఆమె పడిన కష్టం, త్యాగం అన్ని వృథా అయినట్టేనని అభిమానులు చాలా బాధపడుతున్నారు. సమంత ఈ సినిమా కోసం పడిన కష్టం అంతా వేస్ట్ అయినట్టేనా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. శాకుంతలం సినిమా స్పూర్తితో సమంత రానున్న రోజులలో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లు చేయాలని అనుకుందని, కానీ ఈ సినిమా నీరు గార్చిందని కామెంట్స్ చేస్తున్నారు. శాకుంతలం సినిమాని 2022 చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యువరాజు భరత పాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ కనిపించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…