Samantha : సమంత, నాగ చైతన్య జంటని చూస్తే ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2009లో ఏ మాయ చేశావె చిత్రం సెట్స్‌లో కలుసుకున్న ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారో కూడా ఎవరికీ తెలియదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి.
సమంత-చైతూ ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం. పైగా సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 లలో సామ్ ఇంట్లో చెప్పకుండా బోల్డ్‌గా నటించడం వంటివి కూడా కారణాలుగా కనపించాయి. ఏదేమైనా చైతూ నుండి విడిపోయిన తర్వాత ఆయనకు చాలా దూరంగా ఉంటుంది సమంత. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ కొద్ది రోజుల క్రితం అన్‌ఫాలో కూడా చేసేసింది.
అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్‌ఫాలో చేసింది. అంతే కాదు అతనికి బర్త్ డే శుభాకాంక్షలు కూడా చెప్పకుండా ఆశ్చర్యపరచింది. అయితే తాజాగా అఖిల్ బర్త్ డే కాగా ఆయన ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. అంటూ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సమంత పోస్ట్‌పై అఖిల్ స్పందించలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…