Sajjanar : బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 10 మంది ఉన్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఆయనకు ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు.
ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ అని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. ఇక రీసెంట్‌గా రియల్ హీరో సోనూసూద్ కూడా తన సపోర్ట్ శ్రీరామ చంద్రకు అని తెలిపాడు.
ఇక తాజాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్న సజ్జనార్ తన సపోర్ట్ తెలియజేశారు. గేమ్ బాగా ఆడుతున్నావ్, పాటలు బాగా పడుతున్నావ్. నువ్వు టైటిల్ గెలుస్తావనే నమ్మకం ఉందని తన బ్లెస్సింగ్ అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రీరామచంద్ర అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ సజ్జనార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇంతమంది సెలబ్రిటీల మద్దతు అందుకుంటున్న శ్రీరామచంద్ర బిగ్‌బాస్ 5 టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…