Sai Pallavi : ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ.. సాయి పల్లవి. అయితే ఈమె అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ షోలో అప్పట్లో సాయి పల్లవి తన డ్యాన్స్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె నటించిన తొలి సినిమా కస్తూరి మాన్. తమిళంలో వచ్చింది. అయితే ఫిదా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయి ఈమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత కూడా ఈమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
తెలుగుతోపాటు మళయాళం, తమిళ భాషలకు చెందిన సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. అయితే సాయి పల్లవి గ్లామర్ షోకు దూరం. తాను తన సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని చెప్పింది. అందుకనే తాను ముఖానికి ఎలాంటి క్రీములను రాయనని చెప్పేసింది. ఇక తన కెరీర్ మొదట్లో ముఖంపై మొటిమలు బాగా ఉండేవని.. హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారని.. కానీ తన ముఖంపై మొటిమలు ఉన్న కారణంగా భయపడ్డానని.. తనను ప్రేక్షకులు ఏమైనా అంటారేమోనని కంగారు ఉండేదని.. సాయిపల్లవి తెలియజేసింది.
అయితే తన సినిమాలు చూశాక ప్రేక్షకులు తనను ఆదరించారని సాయిపల్లవి తెలిపింది. దీంతో వారు అందానికి కాకుండా నటనకే ప్రాధాన్యతను ఇస్తారనే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పింది. కనుకనే తాను సహజసిద్ధంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని తెలియజేసింది. ఇక సాయిపల్లవి ఫెయిర్‌నెస్ క్రీములకు చెందిన యాడ్స్‌లోనూ అందుకనే నటించనని చెప్పింది. సహజసిద్ధమైన అందానికే ప్రాధాన్యతను ఇస్తా కనుక తాను అలాంటి యాడ్స్‌ను ఎంత ఇచ్చినా చేయలేనని ఈమె గతంలోనే ఖరాఖండిగా చెప్పేసింది. అందుకనే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే సాయిపల్లవి మొటిమలకు చెందిన విషయం ఇప్పటికీ ఇంకా చాలా మందికి తెలియదు. కానీ దాని వెనుక పైన చెప్పిన విధంగా విషయం చాలానే ఉంది. ఏది ఏమైనా.. ఆమె పాటిస్తున్న విలువలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…