Sai Pallavi : టాలీవుడ్‌లో మోస్ట్ క్యూట్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా సాయిపల్లవికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఆమె టాలెంట్ ఏపాటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యే ఆమె నటించిన విరాట పర్వం మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ సాయిపల్లవి ఇందులో అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. ఇక సాయిపల్లవి ఈ మూవీ రిలీజ్‌కు ముందు అనవసరంగా వివాదంలో చిక్కుకుని కొందరు ఫ్యాన్స్‌ను దూరం చేసుకుంది. లేకపోతే విరాటపర్వంకు ఇంకా మంచి టాక్ వచ్చి ఉండేది.
అయితే సాయిపల్లవి తన వ్యక్తిత్వం పరంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమెకు గతంలో అనేక కంపెనీలు భారీ పారితోషికం ఇస్తామని, అందుకు యాడ్స్ చేయాలని ఆమెకు ఆఫర్లను ఇచ్చాయి. కానీ ఆమె వాటిని తిరస్కరించింది. తనకు సహజసిద్ధమైన అందమే ముఖ్యమని కనుక బ్యూటీ మాత్రమే కాదు, ఎలాంటి ప్రొడక్ట్స్‌ను తాను ప్రమోట్ చేయలేనని చెప్పింది. ఇక ఇటీవలే మరో కంపెనీ కూడా ఆమెకు భారీ మొత్తంలో ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆమె ఆ ఆఫర్‌ను కూడా సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వం ఎలాంటిదో మరోమారు చాటుకుంది.
సాయిపల్లవిని చాలా మంది డ్యాన్స్ మాత్రమే కాక.. ఆమె క్యారెక్టర్ అంటే కూడా ఇష్టపడుతుంటారు. అందుకనే ఆమెకు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. ఇక ఈ మధ్యే ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనకు రానా, నాగచైతన్య మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అయితే రానా తనకు విరాట పర్వం షూటింగ్ సమయంలో ఎంతో సహాయం చేశారని.. ఇక చైతన్య అంటే ఇష్టమని.. ఆయన తనను బాగా కేరింగ్‌గా చూసుకుంటారని.. ఆయనతో ఉంటే ఆయనది, తనది ఒకే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ కలుగుతుందని సాయిపల్లవి తెలియజేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…