Sai Pallavi : హీరోయిన్స్ నందు సాయి పల్లవి వేరయా.. అని ఆమె ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. హీరోయిన్ గా పరిశ్రమలో ఉండాలంటే తమ ఇష్టాలు, సిద్ధాంతాలు వదిలేయాలని, గుడ్డిగా దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలనే రూల్ ను ఆమె బ్రేక్ చేశారు. సాయి పల్లవి నటన, డాన్స్ కి తెలుగు, తమిళ భాషల్లో భారీగా అభిమానులున్నారు. పబ్లిక్ వేడుకల్లో సాయి పల్లవిని చూస్తే కుర్రాళ్లు నినాదాలతో హోరెత్తిస్తారు. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమా బడ్జెట్ ఆధారంగా నిర్మాతలకు భారం కాకుండా సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఉంటుంది. సినిమా కారణంగా నిర్మాత నష్టపోయాడని తెలిస్తే డబ్బులు తిరిగిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట.
ఇక సాయి పల్లవి దగ్గరున్న మరో గొప్ప లక్షణం వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉండటం. సదరు వ్యాపార సంస్థలు కోట్లు ఇస్తానన్నా సాయి పల్లవి నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటుంది. సినిమా సినిమాకు సాయిపల్లవి క్రేజ్ పెరగడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం సినిమాలకు నో చెబుతూనే ఉంది. ఆ మధ్య ఒక తమిళ స్టార్ హీరో సినిమాకు నో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ సాయి పల్లవిని కలిసి లేడీ ఓరియంటెడ్ సినిమా కథను చెప్పాడట. కేవలం 40 రోజుల డేట్లు కావాలని అడిగాడట. ఆ కథ లో హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
తక్కువ రోజుల డేట్లు ఇచ్చినా కూడా రెండు కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చేందుకు ఆ దర్శకుడు ఓకే చెప్పాడట. అయితే సాయి పల్లవి స్టోరీ లైన్ విన్న తర్వాత తాను ఆ సినిమాను చేయలేను అన్నదట. పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా సాయి పల్లవి మాత్రం కమర్షియల్ సినిమాలకు ఓకే చెప్పడం లేదు. సాయి పల్లవి కమర్షియల్ సినిమాలు చేయాలని కమిట్ అవ్వడం మొదలు పెడితే.. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉండేవి. వాటి ద్వారా పది కోట్లకు పైగానే ఆదాయం ఆమెకు వచ్చేది. కానీ సాయి పల్లవి మాత్రం ఆ భారీ మొత్తాన్ని తృణప్రాయంగా వదులుకుంది. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది ఈ హైబ్రిడ్ పిల్ల.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…