Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కి కొద్ది రోజుల క్రితం ఊహించని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా స్టోర్ వైపు వెళుతోన్న సమయంలో ఒక్కసారిగా బైక్ పై నుంచి స్కిడ్ అయిన తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తేజూని గుర్తించిన స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్ దసరా రోజు డిశ్చార్జ్ అయ్యారు.
సాయితేజ్ ప్రస్తుతం ఇంటి గ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. గాయాల బారి నుంచి సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండిషన్‌లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతోపాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండిషన్ లోకి వస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ఎవరినీ పెద్దగా కలవకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. గాయాలు అయితే మానాయి కానీ ట్రీట్‌మెంట్ వల్ల ఆయన బాడీలో పలు చేంజెస్ వచ్చాయట. వాటిపై కూడా కొద్దిగా శ్రద్ధ పెడుతున్నాడట తేజు. మరి కొద్ది రోజులలో ఆయన పూర్తిగా కోలుకోనున్నట్టు సమాచారం. దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరికొద్ది రోజుల్లో తన కెరీర్‌లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కానున్నారట తేజ్.
అయితే యాక్సిడెంట్ కాకముందు తేజ్ బరువు బాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం చాలా సన్నగా అయిపోయాడని టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఆయన ఫొటోలను బయటకు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఓ మాదిరి ఆకృతిలోకి వచ్చాక తేజ్ బయట కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ యాక్సిడెంట్ వల్ల సాయిధరమ్ తేజ్ శరీరం పూర్తిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…