మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ.. తేజ్ స్కిడ్ అయి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు తేజ్‌ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. 20 రోజులకు పైగానే తేజ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై అందరిలో ఆందోళన నెలకొని ఉంది.
రీసెంట్‌గా సాయి తేజ్ తన ట్విట్టర్‌లో థంబ్ సైన్ చూపిస్తున్న ఫొటో షేర్ చేస్తూ.. కష్ట సమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి థాంక్స్ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ చూశాక అభిమానులలో ఆనందం అవధులు దాటింది. అయితే సెట్స్ లోకి ఎప్పుడు అడుగుపెడతాడనే అనుమానాలు నెలకొని ఉండగా, వాటికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత #SDT15 షూటింగ్ లో పాల్గొననున్నారు. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాకుండా.. కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానరర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో డిసెంబర్ నుండి పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…