Natu Natu Song : రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ఆలియాభట్‌లు కూడా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఇటు దక్షిణాదిలోనే కాక అటు ఉత్తరాదిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాహుబలితో ఒక రేంజ్ సెట్ చేసిన రాజమౌళి సినిమా అనే సరికి నార్త్ ఇండియా వారు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన ఎన్‌టీఆర్, రామ్ చరణ్ టీజర్‌లు కేవలం సౌత్‌లోనే ఆకట్టుకున్నాయి. అవి పెద్దగా వైరల్ కాలేదు. కానీ తాజాగా విడుదల చేసిన నాటు నాటు సాంగ్ నార్త్ లోనూ చాలా మందిని తెగ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం నాటు నాటు సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సాంగ్ ఆలిండయా లెవల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఈ సాంగ్ మీద చిత్ర యూనిట్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సినిమా పబ్లిక్‌లోకి బాగా వెళ్లాలంటే.. ముందుగానే ఇలా టీజర్ లేదా ట్రైలర్ లేదా సాంగ్స్ వైరల్ కావాలి. ఆ విషయంలో నాటు నాటు సాంగ్ సక్సెస్ అయింది. దీంతో ఈ మూవీకి ఇంకా ఎక్కువ ప్రచారం లభిస్తోంది. ఈ క్రమంలోనే నార్త్‌లో ఇంకా చాలా మందికి ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయని చెప్పవచ్చు.
అయితే అంతా బాగానే ఉంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిజానికి గత రాజమౌళి సినిమాలు వేరు, ఇది వేరు. పూర్తిగా భిన్నమైన కథాంశంతో ఈ మూవీని తీశారు. మరి ఈ మూవీ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…