Roja : భ‌ర్త వ‌ల్ల కోట్లు న‌ష్ట‌పోయిన రోజా.. త‌రువాత ఆమె ఎలా బ‌య‌ట ప‌డిందంటే..?

Roja : 1990 దశాబ్దంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో  నటించింది. తెలుగుతోపాటు త‌మిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో కూడా రోజా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో కూడా రోజా అదరగొట్టింది.

రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు.  తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలోనే చదువుకున్నారు. అంతే కాకుండా నాగార్జున యునివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశారు. చదువుకునే టైంలోనే నటన పై ఉన్న మక్కువతో రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన పరంగా ఎన్నో అవార్డులను దక్కించుకుంది రోజా. దివంగ‌త మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్.. రోజాకు సినిమాల్లో ఆమెకు గురువు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె పేరును రోజాగా మార్చింది కూడా శివ‌ప్ర‌సాదే.

Roja

2002 లో రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వామణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సెల్వమణి  వివాహం  చేసుకున్న  తరవాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో రోజా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. తన ప్రొడక్షన్ లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలు తీయటం కోసం రోజా తాను ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట.

అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన మేరకు మంచి ఫలితాలు అందుకోలేకపోయాయి. దాంతో ఆ సినిమాలకు నష్టాలను చవి చుడాల్సి వచ్చింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రోజా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు రోజా. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా మరింత నష్టపోయారు.

ఇక 2013 లో జబర్ద‌స్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడంతో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకి మల్లెమాల సంస్థ ద్వారా అత్యధికంగా పారితోషికం అందింది. రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో జబర్దస్త్ షో  కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పవచ్చు. ప్రస్తుతం రోజా మంత్రి పదవి లో తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు వెళుతుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM