Roja : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నంత స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంత హైప్ ఈ సారి మా ఎన్నికలకు వచ్చింది. అయితే చివరికి ఉత్కంఠ పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. ఆయన ప్రకాష్ రాజ్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించారు. దీంతో మంచు విష్ణుకు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికలు ఆద్యంతం మా సభ్యురాలు అయిన ఎమ్మెల్యే రోజా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి కూడా పెద్ద హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా వచ్చి ఓటు వేసి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. ఫైర్ బ్రాండ్‌గా రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న రోజా మా ఎన్నికల్లో మాత్రం సైలెంట్‌గా ఉండడంపై రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.
మా ఎన్నికల పోరులో భాగంగా కొందరు టీడీపీ నాయకులు అప్పటికే మంచు విష్ణుకు వైసీపీ మద్ధతు ఉందని ఆరోపించారు. తరువాత మంత్రి పేర్ని నాని అదేమీ లేదని కొట్టి పారేశారు. మా ఎన్నికలకు, తమ ప్రభుత్వానికి, పార్టీకి ఏమీ సంబంధం లేదని తేల్చేశారు. అయినప్పటికీ మంచు విష్ణు విజయం వెనుక వైసీపీతోపాటు బీజేపీ కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత ఉత్కంఠ పోరులో ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎక్కడా కామెంట్లు చేయలేదు. సంచలన వ్యాఖ్యలు చేయలేదు.
అయితే మా ఎన్నికల్లో రోజా సైలెంట్‌గా ఉండడానికి కారణం.. అప్పటికే వైసీపీ మద్దతు మంచు విష్ణుకు ఉందని ఆరోపణలు వస్తున్నాయి, కనుక ఆ సమయంలో ఆమె విష్ణుకు మద్దతుగా మాట్లాడితే ఇంక ఆ ఆరోపణలకు బలం చేకూరుతుంది, అది ప్రభుత్వానికి, పార్టీకి కొంత నష్టం కలిగించవచ్చు.. అన్న ఉద్దేశం ఉండి ఉంటుంది. అందుకనే ఆమె సైలెంట్‌గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయినప్పటికీ ఆమె మంచు విష్ణుకే ఓటు వేస్తారన్నది జగమెరిగిన సత్యమే. అయితే ఇకపై ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో చూడాలి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…