Roja : అందాల రోజా ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తరువాత రాజీయాల్లో చేరి అందులోనూ రాణించారు. మొదట్లో ఆమె రాజకీయాల్లో అన్నీ ఓటములనే చవిచూశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆమె లక్ మారింది. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఓ వైపు సినిమాలు.. టీవీ షోలలో నటిస్తూనే.. మరోవైపు ప్రజా సేవలో, రాజకీయాల్లో రోజా యాక్టివ్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి లభించింది. తన ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. అయితే మంత్రి పదవి వచ్చిన కారణంగా ఆమె ఇక టీవీ షోలు, సినిమాలు చేయనని తేల్చి చెప్పారు.
ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వెళ్లానని.. ఇక ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కాబట్టి బాధ్యత మరింత పెరిగిందని.. కనుక టీవీ షోలు, సినిమాల్లో చేయలేనని.. రోజా తెలిపారు. అందువల్ల ఇకపై ఆమె బుల్లితెర.. వెండితెరలపై కనిపించరు. అయితే ఆమె జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పారు కనుక ఆమెకు నిర్వాహకులు ఓ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి రోజా హాజరయ్యారు. జబర్దస్త్ కమెడియన్లు.. సిబ్బంది అంతా కలిసి రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమెడియన్లతోపాటు.. రోజా కూడా ఎమోషనల్ అయ్యారు.
జబర్దస్త్‌ను విడిచిపెడుతుండడం బాధగా ఉందని.. కానీ నటన అనేది సెకండరీ అని.. తనకు ప్రజా సేవ ముఖ్యమని.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటే ఇక టీవీ షోలు, సినిమాలు చేయలేనని.. చేస్తే ప్రజలకు దూరం అవుతానని.. కనుకనే అన్నింటినీ విడిచిపెట్టాల్సి వస్తుందని.. రోజా తెలిపారు. ఇక వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ప్రస్తుతం విడుదల చేయగా.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…