Rohit Sharma : బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి ఎన్నో అద్భుతాలు చేయగలడు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్. కానీ ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో గెలిచే సత్తా లేదు. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే కోహ్లికి బదులుగా రోహిత్ శర్మకు కెప్టన్సీ పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్‌కు ముందే కోహ్లి తాను ఆ టోర్నీ అనంతరం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఆ టోర్నీలో టీమిండియా చెత్త ప్రదర్శన చేసింది. ఇక ఎలాగూ తప్పుకుంటానని చెప్పాడు కనుక.. కోహ్లి కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే కెప్టెన్‌గా తప్పుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కొనసాగనున్నాడు. మరోవైపు తనకు ఎంతో దగ్గర అయిన కోచ్ రవిశాస్త్రి ఆ పదవి నుంచి దిగిపోయారు. బదులుగా ద్రావిడ్ వచ్చాడు. ఇక టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బుధవారం నుంచి భారత్.. న్యూజిలాండ్‌తో కలిసి స్వదేశంలోనే టీ20 సిరీస్ ఆడనుంది. దీంతో రోహిత్ కెప్టెన్‌గా ప్రయాణం ఈ సిరీస్‌తోనే మొదలవుతోంది. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఎన్నో ట్రోఫీలను అందజేసిన ఘనత రోహిత్ సొంతం. దీంతో భారత జట్టుకు కూడా అతను అదే వైభవం తెస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత టీ20 క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమవుతుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.
కాగా సోషల్ మీడియాలో #CaptainRohitEraBegins పేరిట పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ కూడా చేస్తున్నారు. మరి రోహిత్ శర్మ నిజంగానే మ్యాజిక్ చేస్తాడా ? టీ20 లలో భారత్‌ను అగ్ర పథాన నిలుపుతాడా ? అన్నది చూడాలి. మళ్లీ టీ20 వరల్డ్ కప్ ఇప్పట్లో లేకున్నా.. ఇతర దేశాలతో ఏవైనా సిరీస్ ఆడితే కెప్టెన్‌గా రోహిత్ సత్తా ఏమిటో తెలిసిపోతుంది. మరి రోహిత్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడన్నది.. ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…