Review Lakshman : నటుడు విశ్వక్ సేన్ తన సినిమా విడుదల సందర్భంగా మూవీని ప్రమోట్ చేసేందుకు చేసిన ప్రాంక్ వీడియో వ్యవహారం దెబ్బ కొట్టింది. ఆయనపై, అందులో నటించిన వారు.. దాన్ని చిత్రీకరించినవారిపై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో యాంకర్ దేవికి, నటుడు విశ్వక్ సేన్‌కు మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నెటిజన్లు విశ్వక్ సేన్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే సదరు ప్రాంక్ వీడియోలో నటించిన రివ్యూయర్ లక్ష్మణ్ అసలు ఈ విషయంలో ఏం జరిగిందో చెప్పాడు.
విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మే 6వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన, చిత్రయూనిట్.. రివ్యూయర్ లక్ష్మణ్ తో ప్రాంక్ వీడియో చేయించారు. అందులో లక్ష్మణ్ పెట్రోల్ డబ్బా పట్టుకుని వచ్చి ఒంటి మీద పోసుకుని సూసైడ్ చేసుకుని చనిపోతా అని చెప్తాడు. దీంతో విశ్వక్ సేన్ అడ్డుపడి సముదాయించి పంపించేస్తాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో వెనుక అసలు ఏం జరిగిందో తెలియకపోవడంతో.. అందరూ ఇది నిజమే అని నమ్మారు. కానీ అసలు విషయం తెలిశాక ఇలా చేసినందుకు వారిపై నెటిజన్లు మండిపడ్డారు.
అయితే ఈ ప్రాంక్ వీడియో చేసిన లక్ష్మణ్ మాట్లాడుతూ.. మేం మూవీ ప్రమోషన్స్ మాత్రమే చేశాం.. డైరెక్షన్ టీం చెప్పినట్టే నేను చేశాను.. నేను పెట్రోల్ పోసుకున్నట్టు చేశా.. కానీ అందులో ఉన్నది పెట్రోల్ కాదు.. వాటర్.. అది జనానికి కూడా తెలుసు. మేం ఎవరికీ ఇబ్బంది లేకుండానే ఫ్రాంక్ వీడియో చేశాం.. అని అన్నాడు. అలాగే ఈ విషయంలో కేసులు అదీ ఇదీ అంటున్నారు.. బూతులు తిట్టిస్తున్నారు. ముందు వాళ్లపై కేసులు పెట్టాలి. ట్రాఫిక్‌కి కూడా మేం అభ్యంతరం కలిగించలేదు.. నిజంగానే ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాం.. మేం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫన్నీగా చేశాం. చాలామంది నెగెటివ్‌గా వీడియోలు చేస్తున్నారు. మేం అయితే ఏ తప్పు చేయలేదు.. అంటూ స్పష్టంగా చెప్పాడు. ఈ క్రమంలోనే లక్ష్మణ్ తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…