Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే ఓ చోట కొబ్బరి బొండాలను తాగుతూ బొండాలను నేరుగా అలాగే తాగాలని.. ఎలాంటి స్ట్రాలను ఉపయోగించరాదని.. దీంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని.. తెలియజేసింది. అయితే ఆమె పర్యావరణ ప్రేమికురాలు. అలాగే మూగజీవాల పట్ల జరిగే హింసపై కూడా స్పందిస్తుంటుంది. దీంతోపాటు అప్పుడప్పుడు తన కొడుకు అకీరా నందన్, కుమార్తె ఆద్యలకు చెందిన పోస్ట్‌లను పెడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పోస్టులు వైరల్ అవుతుంటాయి.
ఇటీవలే అకీరా నందన్ కు చెందిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమానికి పవన్ కూడా హాజరు కావడం విశేషం. దీంతో చాలా రోజుల తరువాత వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక తాజాగా రేణు దేశాయ్ మరొక పోస్ట్ పెట్టింది. అదేమిటంటే.. అమెరికాలో సన్ స్క్రీన్ లోషన్స్‌ను ఎక్కువగా వాడుతున్నారని.. అయితే వారిలో చాలా మంది చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే సన్ స్క్రీన్ లోషన్స్ విషయానికి వస్తే తాను వాటిని ఇప్పటి వరకు వాడలేదని తెలిపింది. బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ కోసం ఈ లోషన్స్ రాసుకుంటారని.. కానీ ఇవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయని.. కనుకనే కాస్మొటిక్స్‌ను ఆద్య, అకీరా వాడకుండా చూస్తుంటానని.. రేణు దేశాయ్ తెలియజేసింది.
ఇక కరోనా సమయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పేదల కోసం పనిచేసింది. అయితే సన్ స్క్రీన్ లోషన్ల విషయంలోనే కాదు.. ఇతర కాస్మొటిక్స్‌ను కూడా గుడ్డిగా వాడకండి.. అంటూ రేణు దేశాయ్ యువతకు పిలుపునిచ్చింది. కాగా రేణు దేశాయ్ ప్రస్తుతం ఆద్య అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. త్వరలోనే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…