Renu Desai : బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బద్రి చిత్ర సమయంలో పవన్‌తో ప్రేమలో పడి ఆయనతోనే పెళ్లిపీటలెక్కింది. ఇక 2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్నారు రేణూ దేశాయ్. అయినా ఇప్పటికీ జనాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమెను చూస్తుంటారు. అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్న ఆమె కొన్ని డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.
కరోనా కంటే ముందు నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రైతు గురించి రేణూ దేశాయ్ ఎన్నో ప్రణాళికలు ఆలోచించింది. ఎర్రటి ఎండలో.. నేల రెండుగా చీలి ఉన్న సమయంలోనే షూటింగ్ చేయాలని రేణూ దేశాయ్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. గత రెండేళ్లుగా ఆ టైంలో లాక్డౌన్, కరోనా అంటూ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన రైతు ప్రాజెక్ట్‌ను రేణూ దేశాయ్ పక్కన పెట్టేసింది.
అకీరా నందన్, ఆద్యలతో పాటు రేణూ దేశాయ్ ఓ నెల పాటుగా స్కాట్లాండ్ దేశంలో అంతా తిరిగి వచ్చినట్టుంది. అకీరా గ్రాడ్యుయేషన్ కోసం స్కాట్లాండ్ వెళ్లినట్టు కనిపిస్తోంది. అసలే అకీరా నందన్ తన గ్రాడ్యుయేషన్ కోసం ఏవేవో కలలు కంటున్నాడని రేణూ దేశాయ్ తెలియజేసింది. సంగీతంలో మాస్టర్స్ చేయాలని కోరిక ఉందంటూ, అంతేకాకుండా బాక్సింగ్, బాస్కెట్ బాల్ ఇలా ఆటల్లోనూ ఆరితేరిపోవాలని ఉందంటూ అకీరా నందన్ తన కోరికల లిస్ట్ చెబుతుంటాడట. ప్రస్తుతం రేణూ దేశాయ్ మాత్రం షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టేసింది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది రేణూ దేశాయ్. ఈ చిత్రంతో రేణుదేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నాడు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి, రేణూ దేశాయ్ మాత్రం మాట్లాడుకోలేదు. ఇక ఈ చిత్రంలో భాగస్వామి అయినందుకు, తనకు మంచి పాత్రను తనకు ఇచ్చినందుకు రేణు దేశాయ్ దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది. వేసవి ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్‌లో చాలా మంది గొడుగులు పట్టుకున్నారట. అందరూ షూటింగ్ లో ఎంతో కష్టపడుతూ గొడుగులు పట్టుకున్న వీడియోను రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేసింది. త్వరలో టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రేణుదేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…