Evaru Meelo Koteeshwarulu : బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున, చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. ఈ కార్యక్రమం గత కొన్ని వారాల నుంచి ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ, ఆ తర్వాతి వారాలు క్రమక్రమంగా రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి. తాజాగా బుధవారం రేటింగ్స్ కూడా పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. అయితే నిర్వాహకులు ఊహించని విధంగా ఈ షో రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు.
తాజాగా 5వ వారం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అధికంగా వస్తాయని భావించిన నిర్వాహకులకు 4.70 రేటింగ్స్ రావడంతో ఒక్కసారిగా నిర్వాహకులు షాకయ్యారు. అసలు ఇలా ఉన్నఫలంగా రేటింగ్స్ పడిపోవడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ఐపీఎల్ సరిగ్గా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో రావడం చేత ఎంతో మంది ప్రేక్షకులు ఐపీఎల్ పై ఆసక్తి కనబరచడంతో అయిదవ వారం ఈ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…