Ravi Teja : మాస్ మహరాజా రవితేజ జోరుకి అడ్డే లేదు. ఒకవైపు వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రవితేజ మరోవైపు కొత్త సినిమాలు ప్రకటన చేస్తున్నాడు. అంతటితో ఆగుతున్నాడా.. టైటిల్స్ , సినిమా పోస్టర్స్ అంటూ నానా రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ ప్రకటించిన సినిమాలకు సంబంధించి టైటిల్స్, ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. తాజాగా రావణాసుర అనే టైటిల్ తన 70వ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేశాడు.
కొద్ది రోజుల క్రితం సినిమా ప్రకటన చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. మరి కొద్ది రోజులలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు ఆల్రెడీ అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం.
ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన.. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…