Ravi Teja : రవితేజ, దివ్యాంశ కౌశిక్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం.. రామారావు ఆన్ డ్యూటీ. ఇందులో రాజీషా విజయన్ ఇంకో పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి సొట్ట బుగ్గ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఈ పాట అద్బుతంగా ఉందని కితాబిస్తున్నారు. అయితే ఇందులో రవితేజ, దివ్యాంశ కౌశిక్‌ల మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా రవితేజ హీరోయిన్‌కు లిప్‌లాక్ ఇచ్చే సీన్‌ను ఇందులో చూపించారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
గతంలో రవితేజ నటించిన కిక్ 2 సినిమాలో రకుల్ ప్రీత్‌కు, తరువాత పవర్ సినిమాలో రెజీనాకు లిప్‌లాక్ ఇచ్చారు. వాటిలో కిక్ 2 అట్టర్ ఫ్లాప్ కాగా.. పవర్ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక తరువాత ఈ మధ్యే వచ్చిన ఖిలాడి మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలకు కూడా రవితేజ లిప్‌లాక్ ఇచ్చారు. ఇక తాజాగా రామారావు ఆన్‌డ్యూటీలోనూ ఇదే పరంపరను కొనసాగించారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రవితేజకు లిప్‌లాక్‌లు అచ్చిరావని.. కనుక ఆయన అలాంటి పనులు చేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే శృతి హాసన్‌తో కలిసి చేసిన క్రాక్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందులో ఎలాంటి లిప్‌లాక్ సీన్లు లేవు. కనుక ఆ సీన్లు చేయవద్దని.. అవి అచ్చి రావడం లేదని.. అవి లేకుండా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి వారి విజ్ఞప్తిని రవితేజ పరిగణించి ఆచరణలో పెడతారా.. లేదా.. అన్నది చూడాలి. ఇక రామారావు ఆన్ డ్యూటీ మూవీ త్వరలోనే విడుదల కానుండగా.. దీంతోపాటు రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు మూవీలోనూ నటిస్తున్నారు. స్టూవర్ట్‌పురంలో పేరుగాంచిన గజదొంగ జీవితగాథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…