Rashmika Mandanna : రష్మిక మందన్న ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. దక్షిణాదిలో ప్రస్తుతం పాపులర్ అయిన నటి ఎవరైనా ఉన్నారా.. అంటే.. ఆమె రష్మిక మందన్ననే అని చెప్పవచ్చు. ఈమె గీత గోవిందం సినిమాతో బంపర్ హిట్ కొట్టి తెలుగు తెరకు అతుక్కుపోయింది. తరువాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈమె నటించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. ఈ మధ్యే పుష్ప మొదటి పార్ట్‌తో మన ముందుకు వచ్చింది. డి-గ్లామర్ రోల్ అయినప్పటికీ రష్మిక ఇందులో అద్భుతంగా నటించింది. దీంతో ఆమెకు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి.
రష్మిక మందన్న సినిమా కథలను ఎంచుకునే విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో.. ఫిట్‌నెస్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. అందులో భాగంగానే ఆమె ఖాళీ దొరికినప్పుడల్లా జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుంది. జిమ్‌లో ఈమె అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటుంది. ఇక ఈమె రీసెంట్‌గా జిమ్‌లో ఫిట్ నెస్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా చెమటలు వచ్చేలా వ్యాయామం చేసింది. అనంతరం తన ఫొటోను తీసి షేర్ చేసింది. దీంతో ఆమె ఫొటో వైరల్‌గా మారింది. జిమ్ లో ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతున్న రష్మికను చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఫిట్‌నెస్ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్‌ను చూసి అభినందిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక మందన్న ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ మూవీల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయింది. అలాగే తెలుగులో సీతా రామమ్, పుష్ప ది రూల్ సినిమాల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతోపాటు ఈమె విజయ్‌తో కలిసి ఓ మూవీలో చేయనుంది. అలాగే యానిమల్ అనే ఇంకో మూవీలోనూ నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఈమె ఎంతో బిజీగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…