Rashmika Mandanna : డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం.. లైగర్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఇందులో విజయ్ కి గురువుగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలో విజయ్ లుక్‌కు సంబంధించి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ పూర్తిగా నగ్నంగా కనిపిస్తూ కింది భాగంలో ఒక బొకే అడ్డుగా పెట్టుకుని ఉన్నాడు. పైగా సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. విజయ్ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
లైగర్ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫొటోకు హీరోయిన్లు అందరూ లైక్ కొట్టడమే కాకుండా.. విజయ్‌ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయితే అందరూ సాధారణంగానే విషెస్ చెప్పారు కానీ.. రష్మిక పెట్టిన పోస్ట్.. అందుకు విజయ్ ఇచ్చిన రిప్లై.. ప్రధానంగా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి పోస్టుల కారణంగా వారి రిలేషన్ షిప్ కన్‌ఫామ్ అయిందని అంటున్నారు. రష్మిక ఏమని పోస్ట్ చేసిందంటే.. నువ్వు నాకు ఇన్‌స్పిరేషన్ అని పెట్టింది.
ఇక అందుకు విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చాడు. రుషి.. గీత గోవిందం నుంచి నువ్వే నా వర్కవుట్ మోటివేషన్.. ఈ ప్రపంచం తప్పకుండా చూస్తుంది.. ఇది నా ప్రామిస్.. బిగ్ లవ్.. అంటూ లవ్ ఎమోజీలను పెట్టాడు. దీంతో వీరి పోస్ట్‌లు కాస్తా వైరల్ అవుతున్నాయి. రష్మికకి ఎంత దగ్గరగా లేకుంటే విజయ్ ఆమెను అలా రుషి.. అని పిలుస్తాడు.. కచ్చితంగా వీరు రిలేషన్‌లో ఉన్నారు.. పీకల్లోతు ప్రేమలో మునిగే ఉంటారు.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోమారు వీరి లవ్ ట్రాక్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…