Rashmika Mandanna Ad : సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కష్టమే. కానీ అవి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు. డబ్బు దానంతట అదే వస్తుంది. అయితే కొందరు మాత్రం అలా వచ్చిన పేరును, ప్రతిష్టను చీప్ ట్రిక్స్ చేసి పోగొట్టుకుంటుంటారు. ప్రముఖ నటి రష్మిక మందన్న కూడా ఇలాంటి జాబితాకే చెందుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..
కంపెనీలు తమ బ్రాండ్స్ ను అమ్ముకోవడం కోసం పెద్ద ఎత్తున యాడ్స్ ను ఇస్తుంటాయి. వాటిల్లో తమ అభిమాన తారలు ఉంటే ప్రజలు ఎక్కువగా ఆ వస్తువులను కొంటారని కంపెనీలు కూడా సినీ తారలతో యాడ్స్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. యాడ్స్‌ను తీయడంలోనే అసలు కిటుకు ఉంటుంది.
సినిమా అయితే రెండున్నర గంటల పాటు సమయం ఉంటుంది కనుక స్టోరీని దర్శకుడు ప్రేక్షకులకు బాగా చెప్పగలుగుతాడు. కానీ యాడ్ అంటే 1 లేదా 2 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఐపీఎల్ వంటి మ్యాచ్‌లలో కేవలం 10 సెకన్ల నిడివిలోనే యాడ్‌ను ప్రదర్శిస్తారు. కనుక ఆ సమయంలోనే యాడ్ ఏమిటో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పాలి. దాంతో వాళ్లను కన్విన్స్ చేయాలి. అది వారి మనస్సుల్లోకి వెళ్లాలి. అప్పుడే వారు ఆ యాడ్‌లో చూపించిన వస్తువును కొనుగోలు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అంత తక్కువ వ్యవధిలో యాడ్ ఏమిటో చూపించాలంటే యాడ్‌ను తీసే దర్శకుడికి నిజంగా కత్తి మీద సాము లాంటిదే అని చెప్పవచ్చు.
అయితే యాడ్‌ను తక్కువ సమయంలో చూపించాలి అని చెప్పి అసభ్యంగా ఉండకూడదు. చీప్ ట్రిక్స్ ప్రదర్శించకూడదు. అలా చేస్తే పొగడ్తల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తాయి. సరిగ్గా రష్మిక మందన్న కొత్త యాడ్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆమె నటించిన యాడ్ వల్ల ఆమెపై పొగడ్తల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. కారణం.. అందులో ప్రదర్శించిన చీప్ ట్రిక్సే అని చెప్పవచ్చు.
ఒక యువకుడు యోగా చేస్తూ, ఇతర పనులు చేస్తూ తన చేతులను పైకి ఎత్తితే ఆ సమయంలో అతని అండర్ వేర్ స్ట్రిప్స్ బయటకు కనిపిస్తాయి. వాటిపై ఆ అండర్ వేర్ లోగో ఉంటుంది. దాన్ని చూసి రష్మిక యోగా చేయించేదల్లా నంబర్లు కౌంట్ చేస్తూ ఆ అండర్‌వేర్‌ను చూడాలని చెప్పి చాలా నెమ్మదిగా నంబర్లను కౌంట్ చేస్తుంది. దీంతో ఆ యువకుడు కలగజేసుకుని ఆమె కౌంటింగ్‌ను ముగిస్తాడు. ఈ యాడ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు కానీ.. జనాలకు మాత్రం ఒక విషయం బాగా అర్ధమైంది.
అబ్బాయిలు అండర్ వేర్ అలా ధరిస్తే అమ్మాయిలు అలా చూస్తూ పడిపోతారని ఇందులో సారాంశంగా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. దీంతోనే రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. ఒక ప్రముఖ నటి అయి ఉండి ఇలాంటి యాడ్స్‌లో ఎందుకు నటించాల్సి వచ్చిందని, నటించినా.. మరీ అంత చీప్ ట్రిక్స్ ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటని ? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి దీనికి ఆమె ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…