Rashi Khanna : ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలచుకున్న అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న రాశీ.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదట్లో గ్లామర్ పాత్రలు చేసిన రాశీ ఖన్నా ఈ మధ్య స్కోప్ ఉన్నవే చేస్తోంది. ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో వరుస హిట్లను అందుకున్న రాశీ ఖన్నా.. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో నిరాశ పరిచింది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో ‘ధాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3′, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలతో బిజీగా ఉంది. వీటితో పాటు రాజ్, డీకే రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ చేస్తోంది.
క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా అప్పుడప్పుడూ హాట్ షోతో హీటెక్కిస్తోంది. తాజాగా రాశీ ఖన్నా అందాలు ఆరబోస్తూ చేసిన రచ్చకు యువత మతులు పోతున్నాయి. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా కావల్సిందేనని అంటున్నారు.
రాశీ ఖన్నా రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ‘మీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని ప్రశ్నించాడు. దీనికి రాశీ ‘అసలు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు’ అని బదులిచ్చింది. మరో నెటిజన్ ‘సింగిల్‌గా ఎలా ఉంటున్నావు’ అని అడగ్గా.. ‘ఏదో అలా గడిపేస్తున్నా’ అన్నట్లుగా సమాధానం చెప్పింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…