Rana : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. నేటి యంగ్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రానా ప్రభాస్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకమైన బాహుబలి చిత్రంలో నటించారు. అదేవిధంగా వెంకటేష్, రానా కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుందని ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న రానా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న రానా తాజాగా మరో మల్టీ స్టారర్ చిత్రంతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రానా మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శర్వానంద్ మల్టీస్టారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో సహాయ దర్శకుడిగా పని చేసినటువంటి ఒక యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేయనున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దగ్గుబాటి రానా చాలా కాన్ఫిడెన్స్ గా ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వానంద్ కూడా సినిమా కథాంశం నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…