Ramya Krishnan : టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి, మెప్పించారు. రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇక బాహుబలిలో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
తాజాగా రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో అదరగొట్టారు. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇదిలా ఉండగా డిజిటల్ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా. ఇందులో భాగంగా నాన్-ఫిక్షన్ కేటగిరీలో మరోసారి తన ప్రత్యేకత చాటుకునేందుకు డ్యాన్స్ షోతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
డ్యాన్స్ ఐకాన్ పేరుతో నిర్వహించబోతోన్న ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షోకు న్యాయనిర్ణేతగా లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ వ్యవహరించనున్నారు. ఈ డ్యాన్స్‌షోతో తొలిసారిగా డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు రమ్యకృష్ణ. అయితే ఈ షోలో జడ్జ్ గా వ్యవహరించేందుకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కి రూ.4.5 లక్షలు తీసుకుంటున్నట్టు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే ఎవరూ తీసుకోనంత పెద్ద మొత్తం శివగామి తీసుకుంటున్నట్టే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…