Ramarao On Duty Movie Review : టాలీవుడ్‌లో అనేక మంది హీరోలు ఉన్నా.. వారిలో రవితేజది ప్రత్యేకమైన శైలి అని చెప్పవచ్చు. ఈయన మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. ఇక తాజాగా ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఇందులో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అలాగే వేణు తొట్టెంపూడి మరో కీలకపాత్రలో నటించాడు. ఇక ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఇక రవితేజ సినిమా అంటే ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే భారీ అంచనాలతో రామారవు ఆన్ డ్యూటీ అనే మూవీ థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
ఈ మూవీలో రవితేజ సబ్ కలెక్టర్‌గా కనిపించారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు అద్బుతంగా కనిపిస్తుంది. అయితే రవితేజ ఒక విషయంలో సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రవితేజ తన ఊరిలో కొందరు మిస్సింగ్ అయిన విషయాన్ని తెలుసుకుంటాడు. వారందరినీ కాపాడుకునే క్రమంలో రవితేజ ఎలాంటి ప్లాన్స్ వేశాడు, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి.. చివరకు ఏమవుతుంది.. అన్న వివరాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
తొలిసారిగా రవితేజ ఈ చిత్రంలో భిన్న పాత్రలో నటించారని చెప్పవచ్చు. ఈ మూవీలో ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా అద్భుతమైన పంచ్ డైలాగ్స్‌తో అలరించారు. అలాగే పాటలు యావరేజ్ అయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. నిజాయితీ కలిగిన అధికారి పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారు. ఈ మూవీలోని మాస్ ఎలిమెంట్స్, రవితేజ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శరత్‌కు ఇది ఫస్ట్ మూవీ. అయినప్పటికీ రవితేజను కొత్తగా చూపించారు. ఇక కొన్ని డైలాగ్స్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
అయితే రవితేజ లాంటి మాస్ హీరోను దర్శకుడు ఇంకా బాగా వాడుకుని ఉంటే బాగుండనిపిస్తుంది. అలాగే సాంకేతిక పరంగా ఇంకాస్త మెరుగులు పెట్టి ఉండాల్సిందన్న భావన కలుగుతుంది. ఇక సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా కథ కొత్తదే అయినా రొటీన్ కథనంతో వీక్‌గా నడుస్తుంది. క్లైమాక్స్ అంతగా ఏమీ ఆకట్టుకోదు. అయితే రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్‌లు, యాక్షన్ సీన్ల కోసం ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…