Ram Gopal Varma : టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఇతర హీరోలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చర్చించిన విషయం విదితమే. అందులో భాగంగానే జగన్ త్వరలోనే టిక్కెట్ల ధరలను సవరిస్తూ మరో కొత్త జీవోను విడుదల చేస్తామని చెప్పారు. దీంతో చిరంజీవిని అందరూ ప్రశంసిస్తున్నారు. దాసరి లాంటి పెద్ద దిక్కును కోల్పోయాక చిరంజీవి అంతా తానే అయి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని.. అందరూ కొనియాడుతున్నారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సర్ చిరంజీవి గారు, మెగా ఫ్యాన్‌గా మీరు చేసిన పనికి తీవ్రంగా హర్ట్ అవుతున్నా, ఇది మెగా బెగ్గింగ్.. అని వర్మ అన్నారు. చిరంజీవి అంటే అందరికీ భయమని, కానీ ఇలా బానిసలా ప్రవర్తించడం వల్ల మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని.. అన్నారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.
అయితే ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలను తీసుకుని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు చిరంజీవి కృషి చేశారంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవినే అని స్పష్టం చేశారు.