Ram Charan NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. బాహుబలికి మించి కలెక్షన్లను వసూలు చేస్తూ మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఈ క్రమంలోనే త్వరలో మేకర్స్ ఈ మూవీని చైనా, జపాన్‌లలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల అనంతరం కొంత గ్యాప్ ఇచ్చిన హీరోలు రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లు.. వరుసగా మాలధారణ చేశారు. ముందుగా చరణ్ అయ్యప్ప మాల ధరించగా.. ఇప్పుడు ఎన్‌టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 21 రోజుల పాటు ఆయన నిష్టగా ఉండి తరువాత మాల తీసేస్తారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ ఇద్దరు హీరోలు వరుసగా మాలలను ధరించడం ఆలోచింపజేస్తోంది. వీరు మాలను ఇప్పుడే ఎందుకు ధరించారు.. అది కూడా ఒకరి తరువాత ఒకరు ఏదో కూడబలుక్కున్నట్లు మాలను ధరించారు.. కారణం ఏమై ఉంటుందబ్బా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే అందుకు కారణాలను కూడా వారే అన్వేషిస్తున్నారు. కొన్నింటిని వారు కారణాలుగా చూపుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయితే మాల ధరిస్తామని చరణ్, ఎన్‌టీఆర్‌లు ఇద్దరూ తమ ఇష్టదైవాలకు మొక్కుకుని ఉండవచ్చు. అది ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని తీసేందుకు చాలా కాలం పట్టింది. కనుక వీరికి మాల ధరించే అవకాశం రాలేదని.. ఇప్పుడు సినిమా విడుదలై అంతా సద్దు మణిగింది కనుక ఇక మాలను ధరించవచ్చని అనుకున్నారేమో. కనుకనే ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు మాలలను ధరించారని తెలుస్తోంది. అయితే దీక్షల అనంతరం త్వరలోనే వీరు తమ తమ సినిమాలతో బిజీ కానున్నారు.
చరణ్ నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాత అయిన చరణ్ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే దీక్ష తరువాత ఆయన శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ తదుపరి షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఇక ఎన్‌టీఆర్ ఈ దీక్ష అయ్యాక కొరాటల శివతో సినిమా చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…