Ram Charan : గత ఏడాది ఫిబ్రవరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ల కలయికలో దిల్ రాజు నిర్మాతగా సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభం కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. మనం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్టు తెలిపారు. అయితే మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పుడు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వాయిదాకి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఘన విజయం సాధించడం వల్లనే ఇలా అర్ధంతరంగా వాయిదా వేయడానికి ముఖ్య కారణం అని తెలుస్తోంది. ఇక విక్రమ్ మూవీ మంచి హిట్ సాధించడంతో ఇదివరకే మొదలై మధ్యలో ఆగిపోయిన శంకర్ – కమల్ హాసన్ ల భారతీయుడు-2 చిత్రాన్ని తిరిగి పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ చిత్రం చుట్టూ ఉన్న కోర్టు వివాదాలు కూడా ముగిసిపోవడంతో షూటింగ్ పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టారని సమాచారం. ఈ విరామంలోనే రామ్ చరణ్ కూడా ఎవ్‌వీ ప్రసాద్ ఇంకా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తాను చేయబోయే తదుపరి సినిమాను పూర్తి చేయనన్నట్లు తెలుస్తోంది. హీరో నాని నటించిన జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ గా చేయనున్నారు. అయితే చరణ్ సినిమా ఇలా ఆగిపోవడంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందో.. రాదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…