Ram Charan : మెగా అభిమానులతోపాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ఆచార్య. ఈ మూవీ ఈ నెల 29వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే దర్శకుడు కొరటాల శివ, రామ్ చరణ్ తేజ తాజాగా ఈ మూవీ విశేషాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున జరగనుంది. స్థానికంగా ఉన్న యూసుఫ్ గూడ పోలీస్ మైదానంలో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు చెందిన అనేక విశేషాలను రామ్ చరణ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ మూవీ కోసం తాను తన తండ్రితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. ఆచార్య మూవీ వల్ల తన తండ్రితో కలిసి నటించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని చరణ్ అన్నారు.
ఇక ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందని.. అందుకు కొరటాల శివకు థ్యాంక్స్ చెబుతున్నానని.. చరణ్ అన్నారు. కాగా సినిమాకు వేసిన షూటింగ్ సెట్ నుంచి కాటేజ్‌కు రోజూ వెళ్లి రావాలని చరణ్ తెలిపారు. కాటేజ్‌లో తాము బస చేసేవారమని.. ఉదయాన్నే షూటింగ్‌కు కారులో వెళ్లేవారమని.. కారును కూడా తానే డ్రైవ్ చేసేవాడినని చరణ్ తెలిపారు. ఒకానొక దశలో తన తండ్రితో కలిసి పనిచేస్తున్నానన్న అనుభూతి రాగానే తనకు ఆనంద భాష్పాలు వచ్చేవని.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని.. అలాగే తన తండ్రిని కౌగిలించుకునే వాడినని.. చరణ్ తెలిపారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తోపాటు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా వస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…