Ram Charan : మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటూనే ఉన్నారు. తన వద్దకు వచ్చే వారికి కాదు.. లేదు.. అనకుండా ఆయన సహాయం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లతో ఎంతో మందికి జీవన దానం చేశారు. తాను చేసే సినిమాలు ఫ్లాప్ అయితే నష్టం మొత్తాన్ని ఆయనే భరిస్తుంటారు. ఇటీవల ఆచార్య మూవీ విషయంలోనూ ఇలాగే జరిగింది. అయితే కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఆయన కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారు. ఇక రామ్ చరణ్ తాజాగా తన డ్రైవర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపించి ఆశ్చర్య పరిచారు.
రామ్ చరణ్ తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ నరేష్ బర్త్ డే సందర్బంగా అతనికి తెలియకుండా అతని బర్త్ డే వేడుకలను ప్లాన్ చేశారు. కేక్ కట్ చేసి నరేష్ కు చరణ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో నరేష్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. కాగా ఈ వేడుకల్లో ఉపాసన కూడా పాల్గొన్నారు. అలా తన డ్రైవర్ బర్త్‌డేను అతనికి తెలియకుండా సడెన్‌గా జరిపించి చరణ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇలా చరణ్ చేయడం కొత్తేమీ కాదు. తన దగ్గర పనిచేసేవారిని ఆయన ఇలాగే చూసుకుంటారు. చిరంజీవి కూడా ఇలాగే చేస్తారు. దీంతో చరణ్ కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తుండడంపై ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ నటించిన రెండు సినిమాల్లో ఒకటి భారీ హిట్ అవగా.. ఇంకొకటి ఫ్లాప్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. ఆచార్య డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. ఇక ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి విశ్వంభర అనే టైటిల్‌ను ముందుగా అనుకున్నారు. కానీ పాత టైటిల్‌లా ఉంటుందని చెప్పి.. సర్కారోడు అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనంతరం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి చరణ్ ఓ మూవీ చేయనున్నారు. ఇలా చరణ్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…