Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయిపోయారు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయకు హాలీవుడ్ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
అంతేకాకుండా యాడ్స్‌లో నటించే అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చరణ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ఆయన ఇంటి ముందుకు క్యూ కడుతున్నాయి. ఒక యాడ్ కి రామ్ చరణ్ కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు. కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ యాడ్స్ లో దూసుకుపోతున్నారు. ఈ కోవలోకి రామ్ చరణ్ రాబోతోన్నాడు. సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోయారు రామ్ చరణ్.
మరి కొద్ది రోజుల్లో హీరో బైక్ యాడ్ తో రామ్ చరణ్ జనాల ముందుకు రాబోతున్నారు. కొన్ని నెలల క్రితం అలియా భట్‌తో కలిసి రామ్ చరణ్ మాంగో ఫ్రూటీకి అంబాసిడర్‌గా యాడ్ లో నటించారు. ఇక ఇప్పుడు రండి బాబు విచ్చేయండి అంటూ మీషో ఆన్లైన్ షాపింగ్ కోసం సేల్స్ మెన్ గా అవతారమెత్తారు. రష్మిక గూడా ఫుల్ ఆఫ్ వెరైటీస్, డిస్కౌంట్ అంటూ సేల్స్ ఉమెన్ గా మారిపోయింది. క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కూడా దీని పైన కూడా డిస్కౌంట్ దాని పైన కూడా డిస్కౌంట్ అంటూ సేల్స్ మెన్ గా మీషో యాడ్ లో నటించారు. రామ్ చరణ్, రష్మిక, సౌరవ్ గంగూలీ మీషో మెగా డిస్కౌంట్ సేల్ యాడ్ లో నటించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఆర్‌సి15 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజుకి 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…