Rakul Preet Singh : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. యూత్‌లో రకుల్ కు ఫుల్ క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ 2017 నుంచి బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రకుల్ ఏకంగా 5 హిందీ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో చివరి సారిగా కొండపొలం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా రకుల్‌ని నిరాశపరచింది. దీంతోఈ అమ్మడు ఇప్పుడు ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది.
అమితాబ్, అజయ్ దేవగన్ మల్టీస్టారర్ మూవీ రన్ వే 34 ఏప్రిల్ 29న రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఇందులో రకుల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతోపాటు ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్, సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ ధాంక్ గాడ్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి లాంటి బాలీవుడ సినిమాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యాషన్ సెలక్షన్ అట్రాక్టివ్ గా ఉంటోంది. తన ఫిట్ నెస్ బాడీకి సరిపోయేలా, తన గ్లామర్ ను మరింత రెట్టింపు చేసేలా అవుట్ ఫిట్స్ ను ఎంచుకోవడంలో ఈ సుందరి మేటి అనే చెప్పాలి.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. కొన్ని రోజుల క్రితం తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. మీడియా ముందుకొచ్చిన తనకు ప్రతిసారి పెళ్లి ప్రశ్న కచ్చితంగా ఎదురు పడటంతో.. ఈసారి మాత్రం కాస్త ఫైర్ అయింది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్ కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది. రిలేషన్‌లో ఉండడం అనేది సర్వసాధారణమైన వ్యవహారం అని తెలిపింది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే అని చెప్పింది. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో.. అదే విధంగా జీవిత భాగస్వామి ఉంటారు కదా అని ఈ విషయంపై స్పందించింది. అందుకే తమ విషయం గురించి ఏదైనా చెప్పాల్సిన సందర్భం వస్తే తానే స్వయంగా చెప్తానని రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…