Rajasekhar : నటుడు రాజశేఖర్ ఈమధ్య కాలంలో సినిమాల్లో అంత బాగా ఏమీ కనిపించడం లేదు. ఈయన ఎప్పుడో ఒకటి, రెండు సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈయన తక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన నటిస్తున్న సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈయన తాజాగా నటించిన శేఖర్ చిత్రం ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే రాజశేఖర్ భార్య జీవిత మూవీ విడుదల సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజశేఖర్ స్వయంగా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు.. అనేది ఆయన మాటల్లోనే చూద్దాం..
నాకు చాలా సులభంగా కోపం వస్తుంది. ఎవరు కరెక్ట్ గా లేకపోయినా మాట్లాడతా. ఆ సందర్బంలో గొడవ జరుగుతుంది. కనుక నన్ను కోపిష్టి అనుకుంటారు. నేను ఏది ఉన్నా ముఖం మీదే నేరుగా చెప్పేస్తా. ముక్కు సూటిగా వెళ్తా. అందుకనే నేనంటే కొందరు ఇష్టపడరు. నా మీద నా భార్య జీవిత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటా. కానీ ఆమె అమలు చేస్తుంది. దీని వల్ల ఆమె నాపై డామినేషన్ చెలాయిస్తుందని అందరూ అనుకుంటారు. అది నిజం కాదు.
కథల విషయానికి వస్తే.. జీవితకే ఆ విషయం విడిచిపెడతా. ఆమెకు నచ్చిన కథలను వింటా. చిరంజీవి గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అందరూ మేము గొడవపడతాము.. అనుకుంటారు. అలాంటిదేమీ లేదు. ఇప్పటికీ ఆయనను నేను, జీవిత కలుస్తూనే ఉంటాం. ఆయనతో మాట్లాడుతున్నాం. మా మధ్య రిలేషన్ కూడా బాగానే ఉంది.. అని రాజశేఖర్ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…