Rajamouli : దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. వీరు ఒకరితో ఒకరు ఎంతో చనువుగా ఉంటారు. వీరి ఫ్యామిలీలు కూడా అంతే. రాజమౌళిని అయితే ఎన్‌టీఆర్ జక్కన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే మే 20న ఎన్‌టీఆర్ జన్మదినం సందర్భంగా చాలా మంది ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ రాజమౌళి చెప్పలేదు. దీంతో అసలు వీరి మధ్య ఏమైంది ? ఎందుకు రాజమౌళి ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పలేదు ? అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే 50 రోజుల వేడుకను పూర్తి చేసుకుని ఓటీటీలోనూ రిలీజ్ అయింది. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత లేకుండా చేశారని.. పూర్తిగా చరణ్‌నే ఎలివేట్ చేశారని.. రాజమౌళిపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేసే సీన్లను కొన్నింటిని చివరి నిమిషంలో తొలగించారు. ఇది కూడా ఫ్యాన్స్ అసంతృప్తికి కారణమైంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ నేపథ్యంలో రాజమౌళి, ఎన్టీఆర్ కు మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. కనుకనే వారు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు.
రాజమౌళి, ఎన్‌టీఆర్ పెద్దగా మాట్లాడుకోవడం లేదని.. ఆర్ఆర్ఆర్ తరువాత వారి మధ్య కాస్త దూరం పెరిగిందని అంటున్నారు. కనుకనే ఎన్‌టీఆర్ బర్త్ డే రోజున ఆయనకు రాజమౌళి విషెస్ చెప్పలేదని అంటున్నారు. అయితే ఇవన్నీ పుకార్లేనని.. వాస్తవానికి ఆ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని.. సోషల్ మీడియా వేదికగా రాజమౌళి బర్త్ డే విషెస్ చెప్పకపోయినా.. ఫోన్ చేసి లేదా పర్సనల్‌గా కలిసి విషెస్ చెప్పి ఉంటారని.. కనుక దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన పనిలేదని.. వారి ఫ్రెండ్‌షిప్‌ను అనుమానించక్కర్లేదని కొందరు అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…