Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఇన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక కొద్ది రోజులకు ఆయన వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మహేష్, రాజమౌళి మూవీ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై అప్పుడే భారీగా అంచనాలు పెరిగాయి. అయితే మహేష్‌తో చేయబోయే సినిమాను రాజమౌళి తాజాగా అధికారికంగా కన్‌ఫామ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమాను తీసి రిలీజ్ చేసేందుకు 3 ఏళ్ల సమయం పడుతుందని చెప్పారు. అంటే 2025 లో ఈ ఇద్దరి మూవీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
కాగా రాజమౌళి తన తదుపరి సినిమాకు గ్రాఫిక్స్‌ను అందించేందుకు గాను యూనిట్ ఇమేజ్ అనే సంస్థను సంప్రదించారు. తాజాగా ఆయన ఈ సంస్థకు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓనర్‌ను కలిశారు. ఫ్రాన్స్‌కు చెందిన యూనిట్ ఇమేజ్ సంస్థ 3డి యానిమేషన్, వీఎఫ్ఎక్స్ పనులు చేస్తుంది. మహేష్ తో చేయబోయే సినిమాకు గ్రాఫిక్స్ అందించేందుకు రాజమౌళి ఈ సంస్థను సంప్రదించారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి మకుట కంపెనీతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. కానీ మహేష్ సినిమాకు వేరే సంస్థను ఎంపిక చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే యూనిట్ ఇమేజ్ సంస్థకు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓనర్‌ను కలిసి రాజమౌళి మాట్లాడారు. అయితే ఈ సంస్థకే మహేష్ మూవీ గ్రాఫిక్స్ పనులను అప్పగిస్తారా.. అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ రాజమౌళి మాత్రం మహేష్‌తో సినిమా చేస్తున్నట్లు కన్‌ఫామ్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం వరకు పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2023లో మహేష్, రాజమౌళి మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇందుకు గాను జక్కన్న ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నారు. అయితే ఈ మూవీ గురించి కీలకమైన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…