Rahul Sipligunj : బిగ్ బాస్ కార్యక్రమంతో చాలా మంది లైమ్ లైట్‌లోకి వచ్చారు. కొందరికి బిగ్ బాస్ మంచి క్రేజ్‌ని తెచ్చి పెట్టింది. అలా బిగ్ బాస్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈయన అనేక సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ పాడినప్పటికీ ఆర్థికంగానూ కెరియర్ పరంగానూ ఎదగలేకపోయాడు. సాంగ్స్ పాడటం ద్వారా వచ్చిన డబ్బుల్ని మ్యూజిక్ ఆల్బమ్స్ పెట్టి చాలా వరకూ చేతులు కాల్చుకున్నాడు.
రాహుల్ సిప్లిగంజ్‌కి ఎఫైర్స్ తక్కువేమీ కాదు. హౌజ్‌లో ఉన్నప్పుడు పునర్నవితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు కనిపించాడు. బయటకు వచ్చాక అషూ రెడ్డితో తెగ సందడి చేశాడు. ఇద్దరూ కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత హరిణ్య రెడ్డి అనే అమ్మాయితో సందడి చేశాడు.
ఏదో ఒక విషయంతో తెగ వార్తలలో నిలిచే రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ముంబైలో ఆటో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన అతను అక్కడ తెగ సందడి చేశాడు. ఆటోని స్వయంగా నడుపుతూ తెగ రచ్చ చేశాడు. రాహుల్ ఆటో నడిపిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…