Radhika Apte : బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఈమె హీరోయిన్ల సర్జరీలపై వ్యాఖ్యలు చేసింది. తాను సహజసిద్ధంగా అందంగా ఉండేందుకు ప్రాధాన్యతను ఇస్తానని.. ఇతర హీరోయిన్ల మాదిరిగా శరీర భాగాలకు సర్జరీలు అవి చేయించుకోనని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈమె సంచలన కామెంట్స్ చేసింది. తన కెరీర్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆమె వివరించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రస్తుత తరుణంలో అందాల ఆరబోత చేసే హీరోయిన్లకే డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక శరీర భాగాలు కూడా కచ్చితమైన కొలతలతో ఉండాలి. పెద్దగా ఉండాలి. అలాంటి హీరోయిన్లకే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. అయితే రాధికా ఆప్టేను గతంలో ఒక సినిమాలో తీసుకుని కూడా.. శరీర భాగాలు పెద్దగా లేవు, నువ్వు హీరోయిన్‌గా పనికి రావు.. కనుక నువ్వు మా సినిమాలో చేయలేవు.. అని ఆమెను ఆ సినిమా నుంచి తీసేశారట. ఇదే విషయాన్ని రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
కేవలం శరీర భాగాలు పెద్దగా లేవనే కారణంతో తనను ఓ సినిమా నుంచి తప్పించారని రాధికా ఆప్టే తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే గతంలో తనను శరీర భాగాలకు సర్జరీలు చేయించుకోవాలని చాలా మంది సూచించారని.. కానీ తాను తనకు సహజసిద్ధంగా లభించిన అందానికే ప్రాధాన్యతను ఇస్తానని.. సర్జరీలు చేయించుకోనని చెప్పేశానని.. కాబట్టే సినిమా నుంచి తీసేశారని తెలియజేసింది. కాగా రాధికా ఆప్టే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…