Radhe Shyam : చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధే శ్యామ్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబల్‌స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమకథ గా మెషన్ పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.
వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా ఎప్పుడో రావలసి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమా కోసం దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టగా, యూవీ సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర వడ్డీలనే చెల్లించినట్లు తెలుస్తోంది.
కరోనా వల్ల రెండేళ్ల పాటు చిత్రీకరణ జరగడంతో వడ్డీల భారం పెరిగింది. మరి రాధే శ్యామ్ విడుదల అయ్యాక ఆ రేంజ్‌లో లాభాలు రాబడతాడా అన్నది చూడాలి. 1960ల సమయంలో ఐరోపాలో జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొంత భాగాన్ని ఐరోపాలో షూట్ చేసినప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లలో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది.
రాధే శ్యామ్’ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…