Raasi : ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశి. తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. జగపతి బాబు నటించిన శుభాకాంక్షలు సినిమాతో రాశి తెలుగు తెరకు పరిచయమైంది. సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిగా అనిపించిన నటీమణి రాశి. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషలలోనూ రాశి అందాలు ఆరబోసింది. అగ్ర దర్శకులతో పనిచేసిన రాశి.. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలను చేస్తూనే గ్లామర్ రోల్స్ లో కూడా అల్లాడించింది.
రవితేజ నటించిన వెంకీ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసి మాస్ ఆడియన్స్‌ని ఒక కుదుపు కుదిపింది. నిజం లాంటి సినిమాలో గోపీచంద్ సరసన నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇలా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల రాశి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో అద్భుతమైన అవకాశం వస్తే మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పిందట. ఈ సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు సుక్కూ ముందు రాశిని అనుకున్నారట.
కథ, పాత్ర చెప్పారు. అయితే, పాత్ర స్వభావం కోసం మోకాళ్లపైకి చీర కట్టుకోవాలి.. మందు తాగే సీన్స్ చేయాలి.. అని సన్నివేశాలను చెప్పగానే రాశి నో అన్నదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. అలా మోకాళ్ల పైకి తొడలు కనపడేలా చీర కట్టుకోవాలంటే నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. పెద్ద సినిమా అయినా ఆ పాత్రలో నన్ను చూడాలంటే ఆడియన్స్ అంతగా ఇష్టపడరని వదులుకున్నాను.
కానీ ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేదని తర్వాత అనిపించింది. అయినా అనసూయ ఆ రోల్ లో చాలా బాగా చేసిందని మెచ్చుకుంది రాశి. నిజంగా ఆ రోల్ లో రాశి కనుక చేసి ఉంటే ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మరో లెవల్ లో ఉండేదని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…