Pushpa : అల్లు అర్జున్ తొలిసారి ఊరమాస్‌లో కనిపించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నట విన్యాసం అదిరిపోయింది. శ్రీవల్లిగా రష్మిక కూడా అలరించింది. ఈ సినిమాకు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమాకు రూ.123 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది.
పుష్ప సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతుండగా, ఈ కార్యక్రమంలో సుకుమార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. క్లైమాక్స్‌లో విలన్ ఫహద్ ఫాజిల్, అల్లు అర్లున్ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా అండర్ వేర్ లో కనిపించి చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ప్రేక్షకులను ఆ సీన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ క్లైమాక్స్ సీన్‌పై దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్ ఇద్దరూ ప్యాంట్ షర్ట్ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం’అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథ సెకండ్ పార్ట్‌లో ఉంటుందన్నాడు సుకుమార్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…