Garikapati Narasimha Rao : పద్మశ్రీ అవార్డు గ్రహీత, సహస్ర అవధాని, ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు తాజాగా పుష్ప చిత్రంపై, అందులోని నటీనటులు, దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. పుష్ప చిత్రంలో హీరో స్మగ్లర్ కనుక అతన్ని ఎలా ప్రోత్సహిస్తారని ఆయన విమర్శించారు. స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తూ.. అదేదో ఘనకార్యం అయినట్లు సినిమా ఎలా తీశారని అన్నారు. అల్లు అర్జున్, సుకుమార్‌లు తన వద్దకు వస్తే ఇవే ప్రశ్నలు వారికి వేసి వారిని కడిగేస్తానని కూడా అన్నారు.
స్మగ్లింగ్‌ను ప్రోత్సహించేలా సినిమా తీస్తే.. దాన్ని ప్రేరణగా తీసుకుని సమాజం చెడిపోతే.. అందుకు ఎవరు బాధ్యత వహించాలని కూడా గరికపాటి అన్నారు. అయితే గరికపాటి వ్యాఖ్యలను ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు. ఆయన అన్నది నిజమే అని అన్నారు. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆయనను ట్రోల్ చేస్తున్నారు. సినిమాను సినిమాలా చూడాలని, దాన్ని నిజ జీవితంలో ఎవరూ అనుకరించరని అంటున్నారు.
అయితే గరికపాటి చేసినవి మామూలు వ్యాఖ్యలు కాదు, సంచలన ఆరోపణలు, విమర్శలు. వాస్తవానికి ఇలా ఎవరైనా ఒకరిపై విమర్శలు చేస్తే.. అవతలి సెలబ్రిటీలు కచ్చితంగా స్పందిస్తారు. కానీ పుష్ప టీమ్ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. అంతటి ఘాటు విమర్శలు చేసినా.. అల్లు అర్జున్, సుకుమార్.. ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఎందుకు స్పందించడం లేదని.. ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
అయితే దీని వెనుక కారణం లేకపోలేదు. ఈ విషయంపై పుష్ప టీమ్ కలగజేసుకుని గరికపాటికి కౌంటర్ వేసి ఉంటే.. ఆయనకు పాపులారిటీ వచ్చేది. అనవసరంగా ఆయనకు పాపులారిటీని తెచ్చి పెట్టడం ఎందుకని.. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉంటే అంతా సద్దు మణుగుతుందని, కోరి కోరి ఇందులో పుల్ల పెట్టి రచ్చకెక్కడం దేనికని.. పుష్ప చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే వారు గరికపాటి వ్యాఖ్యలపై స్పందించలేదని సమాచారం. ఇక చిత్ర యూనిట్ ప్రస్తుతం రెండో పార్ట్ షూటింగ్‌లో నిమగ్నమైపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…