Pushpa : సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం పుష్ప. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే ఇందులో రష్మిక ఒక గ్రామీణ యువతి పాత్రలో సందడి చేయనున్నట్లు ఇదివరకే చిత్రబృందం వెల్లడించింది.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్, ట్రైలర్, టీజర్ విడుదల చేసినప్పటికీ ఇంతవరకు హీరోయిన్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే ఇందులో రష్మిక ఎలా ఉండబోతోంది.. అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తాజాగా పుష్ప సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Our fiercest #PushpaRaj's heart melts at the sight of his love ❤️
Meet @iamRashmika as #Srivalli 😍#SoulmateOfPushpa #PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/TFqIGaGGyF
— Mythri Movie Makers (@MythriOfficial) September 29, 2021
ఇందులో శ్రీవల్లి అనే గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మిక.. పుష్పరాజ్ మనసును కరిగించింది అని ట్వీట్ చేస్తూ రష్మిక కూర్చుని అందంగా ముస్తాబవుతున్నటువంటి ఫోటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పనులను పూర్తిచేసుకుని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది.