Charmy Kaur : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
పూరీ జగన్నాథ్ కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన మొదటి నుంచి ఛార్మి ఈ బ్యానర్ పై నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతోంది. కనెక్ట్స్ బ్యానర్ పై మొదటిగా తెరకెక్కిన చిత్రం జ్యోతిలక్ష్మి. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఒక ఇస్మార్ట్ శంకర్ తప్ప అన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో పూరీ జగన్నాథ్ ఆస్తులను మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో వారు కోల్పోయిన ఆస్తులను తిరిగి పొందారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా అందుకున్న సక్సెస్‌తో పూరీ.. లైగర్ సినిమాను తెరకెక్కించాడు.
లైగర్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి, హీరో విజయ్ దేవరకొండకి మొదటి పాన్ ఇండియా చిత్రమిది. ఈ చిత్రానికి చార్మి కూడా నిర్మాణ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టింది. అందుకే ఈ చిత్ర ప్రమోషన్లో ఛార్మీ హడావిడి చాలా చేసింది. విజయ్ బంగారు కొండ, పూరీ ఒక సెన్సేషనల్ అంటూ తెగ గొప్పలు చెప్పేసింది. సినిమా హిట్ అయితే వేరే విధంగా ఉండేది. కానీ లైగర్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎంతసేపూ ఛార్మి ధ్యాసలోనే బతికితే, నువ్వు కొన్నాళ్లకు డైరెక్టర్ అనే విషయాన్ని జనాలు మర్చిపోతారు.. అంటూ పూరీ జగన్నాథ్ ని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. అసలు ఛార్మీ వల్ల పూరీకి ఒరుగుతుందేంటీ అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు జనాలు. అంతేకాదు, అసలు పూరీ.. చార్మీని వదిలేస్తే గానీ సక్సెస్ దారిలోకి రాలేడు అంటూ చెప్పుకుంటున్నారు.
నిజంగా ఇది ఎప్పటికి జరుగుతుందో గానీ, ఛార్మితో కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత పూరీకి అంతా లాసే మిగిలింది. ఇంకా చెప్పాలి అంటే పూరీ ఛార్మితో కనెక్ట్స్ బ్యానర్ పై జనగణమన తెరకెక్కుతోంది. ఇప్పుడు పూరీ సినిమాలు టీజర్‌కి ఎక్కువ ట్రైలర్‌కి తక్కువ అని ప్రేక్షకులు డిసైడ్ అవుతున్నారు. ఈ ప్రభావం జనగణమన చిత్రంపై కూడా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సక్సెస్ చిత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్, ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఛార్మి వల్ల పూరీకి మైనస్ అనే విషయం ఎప్పుడు గ్రహిస్తాడో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…