Puri Jagannadh Assistant Director : టాలీవుడ్ సెన్సేషల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గం చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా లేదా అనే కోణంపై దర్యాప్తు చేయవలసి ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసిందని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశలయ్యాయి.
లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ.70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతలను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…